లావణ్య, మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో మస్తాన్ సాయికి బిగిస్తున్న ఉచ్చుబిగుస్తోంది. ఏప్రిల్ 2023 లో మస్తాన్ సాయి లావణ్య పై దారుణంగా దాడిచేస్తే, గుంటూరు పట్టాభిపురం పోలీసులు 376 ,307, 323, 506, 509 IPC సెక్షన్లు కింద కేసునమోదు చేసినా , మస్తాన్ సాయి ని ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చెయ్యలేదు అని ఆంధ్రప్రదేశ్ DGP కి, గుంటూరు జిల్లా SP కి , పట్టాభిపురం పోలీసులకి నోటీసులు పంపారు అడ్వకేట్ నాగుర్ బాబు. లైంగిక దాడి, హత్యాయత్నం వంటి కేసులులలో నిందితుడిని అరెస్ట్ చేసి, సుప్రీంకోర్ట్ గైడ్‌లైన్స్ మరియు 173(1) of the CrPC ప్రకారం 60 రాజులలో ఛార్జ్‌షీట్ వెయ్యాలి అని నియమాలు ఉండగా, మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహనరావు కి ఉన్న పలుకుబడి వలన గుంటూరు పట్టాభిపురం పోలీసులు 173(1) of the CRPC ని అమలు చెయ్యడంలో విఫలం అయ్యారని లేఖలో పేర్కొన్నారు నాగుర్ బాబు.
Also Read : Jacqueline : సినిమాలు లేక స్పెషల్ సాంగ్స్ తో నెట్టుకొస్తున్నహాట్ బ్యూటీ
మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టి సుమారు రెండేళ్ళ గడుస్తున్నా, గుంటూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే లావణ్య పై నిందితుడు తిరిగి రెండుసార్లు దాడి చేయగలిగాడు అని నోటీసు ఇచ్చారు నాగూర్ బాబు. మస్తాన్ సాయి ప్రసుతం చంచలగూడ జైలు లో ఉన్నాడు అని, మస్తాన్ సాయి జైలు నుండి విడుదల అయిన వెంటనే గుంటూరు పట్టాభి పురం పోలీసులు అరెస్ట్ చెయ్యాలి. అలాగే ఇప్పటివరకు గుంటూరు లో పెట్టిన కేసులో మస్తాన్ సాయి యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోలేదు, మస్తాన్ సాయి పై గుంటూరు పోలీసులు తగు చర్యలు తీసుకోకపోతే, గౌరవ ఆంధ్రప్రదేశ్ హై కోర్టుని ఆశ్రయించి పట్టాభిపురం పోలీసులపై రిట్ అఫ్ మాండమస్ ద్వారా డిసిప్లీనరీ చర్యలు తీసుకోవాల్సింగా కోరతాం’ అని నాగూర్ బాబు పేర్కొన్నారు.