గత కొన్నినెలలుగా సక్సెస్ లేక సతమతమౌతుంది జాక్వెలెన్ ఫెర్నాండేజ్. డ్రగ్స్ వివాదాల్లో చిక్కుకున్న నాటి నుండి కెరీర్ గ్రాఫ్ నేల వైపు చూస్తోంది. సుఖేష్ చంద్ర శేఖర్ ఇష్యూ, మనీలాండరింగ్ కేసులు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా యాక్టింగ్ పై ఫోకస్ చేస్తున్నప్పటికీ లక్ కలిసి రావడం లేదు. చెప్పాలంటే 2018 బిఫోర్ అండ్ ఆఫ్టర్ లా అమ్మడి సినీ కెరీర్ మారింది.
Also Read : Prem Kumar : 96 సినిమాకు మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా.?
2018 లో వచ్చిన రేస్3 ప్లాప్ మొదలు ఇప్పటి వరకు హిట్టు మొహమే చూడలేదు జాక్వెలెన్. మెయిన్ లీడ్స్ గా చేసిన బచ్చన్ పాండే, అటాక్, సర్కస్, రామ్ సేతు సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. బాఘీ 2, సాహో, రాధే సినిమాల్లో చేసిన స్పెషల్ సాంగ్స్ కు సైతం క్రెడిట్ రాలేదు. సుదీప్ హీరోగా వచ్చిన విక్రాంత్ రోణతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెడితే అక్కడ అదే పరిస్థితి. దింతో ఇప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ పై కాన్సట్రేషన్ చేసింది. మేరే అంగ్ నెమే, పానీ పానీ సాంగ్స్ తో యూట్యూబ్ దుమ్ము రేపింది భామ. వీటిపై కాన్సట్రేషన్ చేయడంతో కథల ఎంపికలో కూడా తడబడుతోంది అమ్మడు. గతేడాది యిమ్మి, యుమ్మి, స్టోర్ మ్రిడర్ ఆల్బమ్స్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న జాక్వెలిన్ రీసెంట్లీ మరో మ్యూజిక్ ఆల్బమ్ తీసుకువచ్చింది. టిక్ టిక్ అంటూ సాగిపోయే ఆల్బమ్స్ లో మతిపొగొట్టేస్తోంది మిస్ శ్రీలంక. ఇక రాబోయే సినిమాలైన వెల్కమ్ టు ది జంగిల్, హౌస్ ఫుల్ 5పైనే హోప్స్ పెట్టుకుంది. ఇవి అటు ఇటు అయితే మొత్తానికే మ్యూజిక్ ఆల్బమ్స్ ఫిక్స్ అయిపోయేట్లు కనిపిస్తోంది.