సింపుల్ కథని బ్రిలియంట్ డైరెక్షన్ తో సూపర్ హిట్ గా మలచడంలో మలయాళ సినిమాల దర్శకుల తర్వాతే ఎవరైనా. అలంటి ఓ చిన్న కథతో ఇటీవల వచ్చిన సినిమా జింఖానా. ప్రేమలు ఫేమ్ నస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అలప్పుజా జింఖానా’ ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా సువర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. దీంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసారు తెలుగు మేకర్స్.
Also Read : Vijay Devarakonda : కింగ్‌డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రేమలు చిత్రంతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచుకున్నాడు నస్లెన్. ఆ సినిమా తెలుగులో భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. కాగా జింఖానా తెలుగు వర్షన్ ను ఏప్రిల్ 25, 2025న విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తోలి ఆట నుండే హిట్ టాక్ రావడంతో హౌస్ ఫుల్ షోస్ తో భారీ వసూళ్లు రాబట్టింది. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా తెలుగు స్టేట్స్ లో విడుదలైన 3 రోజులలో రూ. 3.7 కోట్ల గ్రాస్ ని వసులు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన స్ట్రయిట్ తెలుగు సినిమాలు మొదటి ఆట నుండే దుకాణం సర్దేయగా జింఖానా మాత్రం వర్కింగ్ డేస్ లోను డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.