Vijay Devarakonda : కింగ్‌డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కింగ్‌డమ్. ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు దేవరకొండ. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు విజయ్. షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు, రీసెంట్‌గా రిలీజైన టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నాడు.
Also Read : NANI : ‘ప్యారడైజ్’ కష్టాలు తీరినట్టే.. షూట్ స్టార్ట్ ఎప్పుడంటే.?
Also Read
ఎన్టీఆర్ వాయిస్‌తో రిలీజ్ అయిన కింగ్‌డమ్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందుకుతగ్గట్టే ఈ సినిమా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ కింగ్‌డమ్ పై హైప్ పెంచుతూ వెళ్తున్నాడు. ఇక ఈ సినిమాను అనిరుధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటుందని టీజర్ బీజిఎంతోనే చెప్పేశాడు. అయితే ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడట అనిరుధ్. కానీ సినిమా మొత్తంలో మూడే పాటలు ఉంటాయట. ఈ మూడు కూడా ఓ రేంజ్‌లో ఉంటాయని అందులో ఒకటి లవ్ సాంగ్ అని తెలుస్తోంది. కింగ్ డమ్ ఫస్ట్ సాంగ్ ప్రోమోను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇక ఈ సినిమాలో పాటలే కాదు అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పీక్స్‌లో ఉంటుందని సమాచారం. మరి ఈసారి అనిరుధ్ తన మ్యూజిక్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ లో ఉన్న కింగ్‌డమ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!