ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 35 మంది ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు పాల్గొననున్నారు. ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై…