ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాల లైనప్ లో బిజీగా ఉన్నాడు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ షెడ్యూల్ అయిపోగా రేపట్నుంచి వైజాగ్ లో మరో షెడ్యూల్ మొదలవుతుంది.. ప్రస్తుతం అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేస్తున్నారు.. ఆయన రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున పూలను చల్లుతూ ఘన స్వాగతం పలికారు.. ఫ్యాన్స్ భారీ ఎత్తున చేసిన ర్యాలీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
అల్లు అర్జున్ కొత్త ఫోటోలు చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. ఆనందం మరింత రెట్టింపు చేయడానికి అల్లు అర్జున్ కొత్త యాడ్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఆస్ట్రల్ పైప్స్ కి చేసిన కొత్త అడ్వర్టైజ్మెంట్ ని నేడు విడుదల చేశారు. ఈ యాడ్ లో ఓ బలవంతుడిని కొట్టడానికి అందరూ రకరకాల వాటితో ప్రయత్నించినా పడకపోవడంతో అల్లు అర్జున్ వచ్చి ఆస్ట్రల్ పైప్స్ తో కొట్టగానే ఒక్కసారిగా కుప్పకూలి పడతాడు.. ఆస్ట్రల్ పైప్స్ తగ్గేదేలే.. లీక్ అయ్యేదే లే అంటూ డైలాగు చెప్తాడు..
అల్లు అర్జున్ చెప్పిన కొత్త డైలాగ్ తెగ వైరల్ అవుతుంది.. దీంట్లో కూడా పుష్ప డైలాగ్ ఫార్మేట్ లో డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు.. ఆ యాడ్ ను మీరు ఒకసారి చూసేయ్యండి..సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమా ఏడాదిలోనే విడుదల కాబోతుంది..