పుష్ప 2 సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఇప్పటికే మొదటి రోజు దాదాపుగా 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆర్ఆర్ఆర్ బాహుబలి కలెక్షన్లను సైతం దాటేసి అత్యధిక వసూళ్లు సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అయితే అల్లు అర్జున్ సినిమాలో డైలాగుల గురించి పెద్ద చేర్చే జరుగుతోంది. ముఖ్యంగా బాస్ అంటూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ స్పందించింది. కావాలని సృష్టిస్తూ నెగిటివ్ ప్రచారాలకు వాడుతున్న వారి మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Pushpa 2: బాస్ డైలాగులపై టీం స్ట్రాంగ్ వార్నింగ్!
అయితే కొంతమంది అభిమానులు కొన్ని చానల్స్ కు అల్లు అర్జున్ అభిమానుల సంఘం తరఫున హాజరైనట్లు చెబుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఈ అంశం మీద స్పందించింది. అల్లు అర్జున్ గారి తరపున ఎవరైనా ఫాన్స్ అని చెప్పుకొని టివి మరియు యు ట్యూబ్ ఇంటర్వ్యులు ఇచ్చిన అది వారి వ్యక్తిగతం అంతే గాని వారి భావజాలానికి అధికారిక మద్దతు లేదా సపోర్ట్ ఉండదు. ఏ ఇతర హీరోల మీద లేదా రాజకీయంగా ఏ నాయకుల మీద అల్లు అర్జున్ ఫాన్స్ అని చెప్పి చేసే కామెంట్స్ మేము సపోర్ట్ చేయం అలాంటి అభిమానులను దూరంగా ఉంచటం జరుగుతుంది అని అంటూ ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది.