పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. నిజానికి ఈ సినిమాకి ముందు రోజు రాత్రి 9:30 గంటల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. అయితే ప్రీమియర్స్ మధ్యలో ఉన్నప్పటి నుంచి సినిమాలో బాస్ అనే ఒక డైలాగ్ ని మెగాస్టార్ చిరంజీవికి అన్వయిస్తూ మార్చేసిన డైలాగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరుల్ అయ్యాయి. ఒకరకంగా ఆ డైలాగ్స్ నిజమే అనుకొని కొన్ని చానల్స్ కూడా డిబేట్లో నిర్వహించాయి అంటే అవి ఎంతగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Allu Arjun: మరణించిన మహిళ కుటుంబానికి 25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్
ఇక ఈ విషయం మీద కాస్త ఆలస్యంగా నిద్రలేచిన మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యం ఈ విషయం మీద స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేసింది. ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగిటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు.