అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ మంచి ధరకు కొనుగోలు చేసింది. ఏ సినిమా అయినా థియేటర్లలో ఫ్లాప్ అయితే ఓటీటీ సంస్థలు ఆ చిత్రాలను వీలైనంత త్వరగా వాటిని స్ట్రీమింగ్ కు పెట్టేస్తాయి.
Game Changer: హిందీ స్ట్రీమింగ్ కి రెడీ అయిన గేమ్ ఛేంజర్
కానీ అఖిల్ ఏజెంట్ రెండేళ్లు దాటినా కూడా ఇప్పటికి ఓటీటీలో ప్రసారానికి ఉంచలేదు రైట్స్ కొనుగోలు చేసిన సోనీ లివ్. గతంలో ఓ సారి విడుదల చేస్తున్నామంటూ ప్రకటించి వాయిదా వేసింది. ఏజెంట్ ను 2024 సెప్టెంబర్ 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దీంతో అయ్యగారు ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.కానీ సోనీ లివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుండి ఏజెంట్ డిజిటల్ ప్రీమియర్ పోస్టర్ లను తొలగించింది. ఫైనల్ గా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వక్కంతం వంశీ అందించిన కథకు దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాకు స్క్రీన్‌ప్లేను కూడా రచించారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.