రామ్ చరణ్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల తర్వాత జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నిజానికి మొదటి ఆట నుంచే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అందుకే మొత్తం రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
RS Brothers: అత్తాపూర్లో ఆర్ఎస్ బ్రదర్స్ 13వ షోరూం ఓపెన్ చేసిన నిధి అగర్వాల్!
కానీ ఇప్పుడు తాజాగా హిందీలో కూడా స్ట్రీమింగ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. 400 కోట్ల రూపాయల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం 195 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దిల్ రాజు సహా సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన అందరికీ నష్టాలే మిగిలాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన సౌత్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుక్కుంది. ఇప్పటికే సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతుంది. కానీ హిందీ వర్షన్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం జీ5 సంస్థ కొనుగోలు చేసింది. హిందీలో 8 వారాల ఓటీటీ థియేట్రికల్ విండో డీల్ ఉండడంతో సినిమా రిలీజ్ అయిన 8 వారాల వరకు ఆగారు. ఇప్పుడు ఈ ఏడవ తేదీ నుంచి ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.