అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో కలిసి దానికి సీక్వెల్ గా అఖండ తాండవం అంటూ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అంచనాలు ఒక రేంజ్ లో పెంచేసింది. ఈ నేపథ్యంలో సినిమా టీం ఓటీటీ డీల్ క్లోజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది.
Also Read : Pawan Kalyan: మరో సినిమాకి పవన్ గ్రీన్ సిగ్నల్?
ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే నిర్మాతలు మాత్రం ఏకంగా 80 కోట్ల రూపాయలు ఈ సినిమాకి కోట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అఖండ విజయం, ఈ సినిమా మీద ఉన్న హైప్ తో ఆ రేంజ్ బడ్జెట్ కూడా పెడుతున్నాం కాబట్టి కచ్చితంగా 80 కోట్లకు తగ్గితే సినిమా ఇచ్చే ప్రసక్తి లేదని తెలిసి చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read : Air India Plane Crash: విమానంలో 232 మంది ప్రయాణికులు,10 మంది సిబ్బంది.. ఆ కారణంతోనే క్రాష్!
ఇక బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకు విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా మీద అమాంతం అంచనాలు పెంచేసింది. ఇకమీదట ఈ సినిమా విషయంలో ఇంకా జాగ్రత్తగా ప్రమోషన్స్ చేయాలని టీం భావిస్తోంది అందుకే ఇప్పటినుంచే సినిమాకి సంబంధించిన పోస్టర్లను ముఖ్యంగా నార్త్ బెల్ట్ మొత్తానికి హార్ట్ గా భావించే బొంబాయి ప్రాంతాలలో ప్రచురించడం గమనార్హం.