బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్‌గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్ థ్రిల్లర్ తెరకెక్కించాలని అనుకుందట ఏక్తాకపూర్ ప్రొడక్షన్ హౌస్. కానీ రెమ్యునరేషన్, లాభాల్లో వాటా అడిగి ఖంగుతినిపించిదని మొన్నామధ్య బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి.
Also Read : Tollywood : ప్రధాని మోడీకి టాలీవుడ్ స్టార్ హీరోస్ బర్త్ డ్ విషెష్,,, ఎవరెవరు ఏమన్నారంటే
స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా శ్రద్దా నుండి నయా ప్రాజెక్ట్ అప్డేట్ లేదు. ఫ్యాన్స్ ఈమె నెక్ట్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటే బాయ్ ఫ్రెండ్‌తో షికార్లు తప్ప ఎనౌన్స్ మెంట్ లేదు. కానీ ప్రజెంట్ బాలీవుడ్‌లో వినిపిస్తున్న డిటైల్స్ ప్రకారం సాహో బ్యూటీ ఓ మూవీకి కమిటయ్యిందట. చావాతో ఫ్రూవ్ చేసుకున్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఫిల్మ్ చేస్తుందట. మరోసారి మరాఠీ బ్యాక్ డ్రాప్ స్టోరీ చేస్తున్నాడట లక్మణ్. స్త్రీ2తో సక్సెస్ తర్వాత మడాక్ ఫిల్మ్ మళ్లీ శ్రద్దాను పిలిచి ఓ పవర్ ఫుల్ ఫీమేల్ స్టోరినీ ఆమెకు వినిపించిందని టాక్. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట మేడమ్. పాపులర్ మఠారీ నోవెల్ ఆధారంగా సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటుందట శ్రద్దా. క్లాసికల్ డ్యాన్సులు, సింగింగ్ లెసన్స్ సంబంధించిన వర్క్ షాపుల్లో పాల్గొంటుందని బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న బజ్. ఈ నవంబర్ నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనుందట మడాక్ ఫిల్మ్స్. అన్నీ అనుకున్నట్లు జరిగితే నెక్ట్స్ ఇయర్ రిలీజ్ ప్లాన్ అనుకుంటున్నారట.