జులై 28న అమలాపురం నుంచి అమెరికా వరకూ సినిమా పండగ మొదలయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రీమేక్ అయినా కూడా సెన్సేషన్ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యేలా చేసింది. ఈ బ్రో మ్యాజిక్ ని మర్చిపోయేలోపే మెగా మేనియాని మరింత పెంచడానికి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. మెగా తుఫాన్ తో తెలుగు బాక్సాఫీస్ ని కబ్జా చేయడానికి చిరు ‘భోళా శంకర్’గా ఆడియన్స్ ముందుకి రానున్నాడు. మెగా ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు కాబట్టి అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ భోళా శంకర్ సినిమా ఆగస్టు నెల మొత్తం హంగామా చేయనుంది.
మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన భోళా శంకర్ సినిమా కూడా రీమేక్ గా తెరకెక్కింది. అయితే భోళా శంకర్ ట్రైలర్ చూసిన వాళ్లకి మాత్రం రీమేక్ అనే విషయాన్నీ మైండ్ లో నుంచి తీసేసే రేంజులో కనిపించాడు చిరు. కామెడీ, యాక్షన్, సిస్టర్ సెంటిమెంట్ లాంటి ఎలిమెంట్స్ భోళా శంకర్ సినిమాలో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యి ఉన్నాయి. చిరు కూడా చాలా యంగ్ గా కనిపిస్తూ, వింటేజ్ వైబ్స్ ఇస్తున్నాడు కాబట్టి ఆగస్టు 11న మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ గ్యారెంటీ. ఇది చాలదన్నట్లు చిరు సినిమాలో, చిరు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసే సీన్స్ ఉండడం మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విషయం. ఇలాంటి సీన్స్ భోళా శంకర్ సినిమాలో చాలానే ఉంటాయని స్వయంగా చిరునే చెప్పాడు కాబట్టి థియేటర్స్ లో ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. మరి భోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాస్ హిస్టీరియా క్రియేట్ చేస్తాడో చూడాలి.