Chiranjeevi : బాక్సాఫీస్ వద్ద మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2 వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ లోనే ఉంది. ఈ రెండు నెలల్లో షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యేలా కనిపించట్లేదు. దీంతో ఓజీ ఆ డేట్ న రాకపోవచ్చని తెలుస్తోంది. ఓజీ రాకపోతే మాత్రం అన్న చిరంజీవి నటించిన విశ్వంభర రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయలేదు.
Read Also : Arjun Das : ఒకప్పుడు అవమానాలు.. లైఫ్ ఇచ్చిన పవన్ కల్యాణ్..
ఆగస్టులో వరుసగా పెద్ద సినిమాలు ఉన్నాయి. దీంతో సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఓజీ సినిమా వస్తే సెప్టెంబర్ నుంచి విశ్వంభర తప్పుకుంటుందంట. ఒకవేళ ఓజీ రాకపోతే మాత్రం అదే 25వ తేదీన విశ్వంభరను దించుతారని సమాచారం. అదే జరిగితే మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య, చిరంజీవి పోటీ తప్పదు. వీరిద్దరూ ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడి మరీ కలెక్షన్లు సాధించారు. ఇద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక్కోసారి ఒక్కొక్కరు పైచేయి సాధిస్తూ వస్తున్నారు. ఈ సారి అఖండ-2, విశ్వంభర భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలే. పైగా రెండూ వేర్వేరు కథలతో వస్తున్నాయి. చిరంజీవి మూవీ భారీ సోషియో ఫాంటసీతో వస్తోంది. బాలయ్య సినిమా సనాతన ధర్మం, అఘోరా పాత్రలను బేస్ చేసుకుని వస్తోంది. మరి సెప్టెంబర్ లో ఈ భారీ పోటీ ఉంటుందా లేదా అనేది చూడాలి.
Read Also : Prabhas : నటుడు ఫిష్ వెంకట్ కు ప్రభాస్ భారీ సాయం..?