Prabhas : కమెడియన్ ఫిష్ వెంకట్ దీన పరిస్థితుల్లో ఉన్నాడు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో చాలా ఏళ్లుగా డయాలసిస్ తో కాలం నెట్టుకొస్తున్నాడు. కానీ తాజాగా ఆయన పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న వీడియోలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తన తండ్రికి కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని.. లేదంటే బతకడు అని ఆయన కూతురు స్రవంతి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రి వైద్యానికి రూ.50 లక్షల దాకా ఖర్చు అవుతాయని.. దాతలు ఆదుకోవాలంటూ వేడుకుంది. తాజాగా హీరో ప్రభాస్ అసిస్టెంట్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు ఆమె చెప్పింది.
Read Also : Review : 3 BHK
ఆపరేషన్ చేయడానికి వీలైనంత వరకు సపోర్ట్ ఇస్తామని వాళ్లు చెప్పినట్టు తెలుస్తోది. తండ్రికి తన కిడ్నీ ఇవ్వడానికి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్లు వద్దన్నారని స్రవంతి చెప్పింది. తన తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా.. అతనికి అనారోగ్య సమస్యలు ఉండటంతో డాక్టర్లు వద్దన్నారని చెప్పుకొచ్చింది. తండ్రి బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ అయ్యే డోనర్ కోసం ఎదురు చూస్తున్నట్టు వివరించింది. ఎవరైనా దాతలు ఉంటేముందుకు రావాలని కోరింది. ఫిష్ వెంకట్ ప్రస్తుతం బోడుప్పల్ లోని ఆర్బీఎం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. రీసెంట్ గానే కొన్ని మీడియా ఛానెల్స్ లో ఫిష్ వెంకట్ దీన స్థితి గురించి కథనాలు వచ్చాయి. అవి చూసిన చాలా మంది స్పందించారు. టాలీవుడ్ పెద్దలు తమను ఆదుకోవాలంటూ స్రవంతి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఫిష్ వెంకట్ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also : HHVM : ట్రైలర్ తో వాటికి సమాధానం చెప్పిన వీరమల్లు..