Chiranjeevi: తెరమీద కనిపించే వారందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. కానీ, తెరవెనుక కష్టపడే వారి కష్టం ఎవరు గుర్తించరు. కథలు రాసి, స్క్రిప్ట్ రాసి, డైలాగ్స్ ఇచ్చి.. సినిమాకు సగం విజయాన్ని తీసుకొచ్చేవారిని ప్రేక్షకులే కాదు.. ప్రముఖులు కూడా గుర్తించరు. అయితే చిరంజీవి అందుకు విరుద్ధం. తనకు హెల్ప్ చేసినవారిని గుర్తుపెట్టుకుంటారు.. తమ సినిమాలకు మంచిపేరును తీసుకొచ్చినవారిని గుర్తుపెట్టుకుంటారు. తాజాగా నంది అవార్డు గ్రహీత, స్క్రిప్ట్ రైటర్ సత్యానంద్‌పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రస్థానం మొదలై 50 ఏళ్లు పూర్తికావడంతో.. చిరు.. ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన అభిమానాన్ని వెల్లడించారు.
Shiyas Kareem: బిగ్ బాస్ నటుడు అరెస్ట్.. మహిళపై అత్యాచారం.. చిత్రహింసలు పెట్టి..
“ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ, ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే ఆస్వాదిస్తూ , సినిమాని తన జీవన విధానం గా మలచుకున్న నిత్య సినీవిద్యార్ధి , తరతరాల సినీ ప్రముఖులoదరికీ ప్రియ మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్ గారు తన సినీ ప్రస్థానం లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు. ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం , నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది. డియరెస్ట్ సత్యానంద్ గారు , మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్త గా, మరో అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను.. మీకు మరింత శక్తి ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను” రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి
స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే… pic.twitter.com/Tc7aphFOD2— Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2023