Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కంప్లీట్ రెస్ట్ లో ఉన్నాడు. ఈ మధ్యనే మోకాలి సర్జరీ చేయించుకున్న చిరు.. మరో రెండు మూడు రోజుల్లో సెట్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం చిరు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మెగా 156 .. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మెగా 157 .. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా మెగాస్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇక ఈసారి మరో తమిళ్ డైరెక్టర్ తో జతకడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరు.. మోహన్ రాజా తో గాడ్ ఫాదర్ అనే సినిమా తీశాడు. ఇక ఇప్పుడు పీఎస్ మిత్రన్ కు ఒక అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. పీఎస్ మిత్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కించిన అభిమన్యుడు, సర్దార్, హీరో సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ప్రస్తుతం విశాల్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
Pawan Kalyan: కళ్లు.. కళ్లు ఎలా ఉంటాయి.. వేటకు వెళ్ళేటప్పుడు పులి కళ్లలా ఉంటాయి
ఇక ఈ సినిమా తరువాత మిత్రన్.. చిరుకు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ను వినిపించాడని, అది ఆయనకు నచ్చడంతో ఓకే కూడా చెప్పాడని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాను చిరు కూతురు సుస్మితనే నిర్మించనుందట.. అంతేకాకుండా ఒక తమిళ్ బ్యానర్ తో కొలాబరేట్ అవుతుందని కూడా టాక్. మిత్రన్ నుంచి వచ్చిన ప్రతి సినిమా.. ఏదో ఒక మెసేజ్ కచ్చితంగా ఉంటుంది. చిరుకు ప్రయోగాలు చేయడం బాగా ఇష్టం. అందుకే వీరి కాంబోపై బాగా అంచనాలు పెరిగాయి. ఇక స్క్రిప్ట్ విషయంలో చిరు.. కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేస్తారని టాక్ ఉంది. ఇక అలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉంటే .. ఈ కాంబో సూపర్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.