Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి OG. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ విలన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముంబై గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. ఇక OG సినిమా మొదలైనప్పటి నుంచి .. ఒక్కో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.
Simha Koduri: మురళీ మోహన్ ఇంటి అల్లుడు కాబోతున్న కీరవాణి కొడుకు..?
ఇక తాజాగా మరో పోస్టర్ తో ఫ్యాన్స్ ను పిచ్చెక్కించారు. విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ .. పవన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. హ్యాపీ ఆయుధ పూజ అంటూ రాసుకొచ్చారు. ఇక పోస్టర్ లో పవన్ ఫేస్ మాత్రమే చూపించారు. ముఖ్యంగా అందులో పవన్ కళ్లు.. ఆ కళ్లను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. చురకత్తులు లాంటి చూపుతో పవన్ సీరియస్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టర్ ను చూసిన అభిమానులు.. అతడు సినిమాలో మహేష్ బాబుకు ఎలివేట్ చేసే డైలాగ్ ను గుర్తుచేస్తున్నారు. కళ్లు.. కళ్లు ఎలా ఉంటాయి.. వేటకు వెళ్ళేటప్పుడు పులి కళ్లలా ఉంటాయి అంటూ చెప్పుకొస్తున్నారు. మరో ఈ సినిమా పవన్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.