Major Attraction In Bholaa Shankarవాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నారు. గతంలో ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడి కొన్నాళ్ళు మెగా ఫోన్ కు దూరంగా ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పటికే 14.5 మిలియన్ వ్యూస్ తో ఆ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. చిరంజీవి స్వాగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానులు, మాసెస్ ఎంతగానో ఆకట్టుకుంటుండగా ఇప్పటికే రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కూడా చేయడం మొదలు పెట్టారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ టీజర్, ట్రైలర్ తో భోళా శంకర్ సినిమాలో యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని అర్థమైంది.
Ashes series: స్టీవ్ స్మిత్ రనౌట్ పై వివాదం.. ఏంటి సర్ అది నాటౌట్ హా..
అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని అంటున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్ అన్న చెల్లెలు బంధం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. అన్న చెల్లెలుగా చిరంజీవి, కీర్తి సురేష్‌ల సీక్వెన్స్‌లు సినిమాకు బలంగా నిలుస్తాయని, వీరిద్దరి బాండింగ్ , హ్యుమర్, డ్రామా, ఎమోషన్స్ కూడా టచ్ చేసేలా ఉంటాయని అంటున్నారు. ఆ లెక్కన భోళా శంకర్ కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు పరిమితం కాదని, మాస్, యూత్, ఫ్యామిలీస్‌ని సమానంగా ఆకట్టుకునే సినిమాగా ఉంటుందని గర్వంగా చెబుతోంది.. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం, డడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందించారు. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ భోళా శంకర్ సినిమా కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారు.