Chiranjeevi: మెగాస్టార్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ ను అందుకుంటామని చెప్పడానికి బ్రాండ్. ఎన్ని అడ్డంకులు వచ్చిన స్వయంకృషిగా ఎదగాలని అని చెప్పడానికి బ్రాండ్.. ఇప్పుడు వస్తున్నా ఎంతోమంది నవతరానికి, రేపు రాబోయే భావితరానికి కూడా చిరంజీవినే స్ఫూర్తి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఎక్కడ ప్రశంసలు ఉంటాయో అక్కడ విమర్శలు ఉండడం సర్వసాధారణమైన విషయమే. చిరును ప్రశంసించేవారు ఎంతమంది ఉన్నారో.. విమర్శించేవారు కూడా అంతేమంది ఉన్నారు. ఏ మనిషి అయినా.. ఎదిగాకా.. తమను ఈ స్థాయిలో నిలబెట్టిన వారిని మర్చిపోకూడదు. ముఖ్యంగా చిరు.. ఇండస్ట్రీకి వచ్చింది.. ఆయనకు ఇంత స్టేటస్ ను అందించినవారిని మర్చిపోయాడు అని చాలా రకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కామెంట్స్ కు సమాధానం దొరికింది.
Kushi: అంతా బానే ఉంది.. ఆ ఒక్కటీ సెట్ అయితే ఇక ఆపేవారే లేరు..
చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి.. చిన్న చిన్న పాత్రలు, సెకండ్ హీరోగా చేస్తున్న సమయంలోనే ఇతడిలో ఒక హీరో ఉన్నాడు.. ఎప్పటికైనా గొప్ప హీరో అవుతాడు అని నమ్మి తన కూతురును ఇచ్చి చిరుకు పెళ్లి చేసిన వ్యక్తి అల్లు రామలింగయ్య. ఆయన లేకుండా చిరు ఇప్పుడు ఈ స్థానంలో ఉండేవాడు కాదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇక ప్రతి బిడ్డకు తండ్రినే మొదటి హీరో. ఎన్ని కష్టాలు పడి అయినా కూడా బిడ్డలను పెంచాలని చూస్తాడు. జీవితంలో కన్నవారిని.. పైకి తీసుకొచ్చినవారిని దేవుళ్ళతో సమానంగా చూడాలి. ప్రస్తుతం చిరు అదే పని చేస్తున్నాడు. పూజ గదిలో తండ్రి, మామ ఫోటోలను పెట్టి పూజిస్తున్నాడు. నేడు రాఖీ సందర్భంగా చిరు పోస్ట్ చేసిన వీడియోలో వీరిద్దరి ఫోటోలను పూజ గదిలో చూడొచ్చు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు అది చిరంజీవి సంస్కారం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.