Chiranjeevi – Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి, అల్లు అర్జున్ కనకరత్నమ్మ పాడె మోశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చిరంజీవి, రామ్ చరణ్ దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.
Read Also : Vishal : దాని కోసమే ఇన్నేళ్లు పెళ్లి చేసుకోలేదు.. విశాల్ కామెంట్స్
అల్లు అర్జున్ ఇంటికి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు వచ్చి వెళ్లారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. కోకాపేటలో జరగనున్న అంత్యక్రియలకు అల్లు, మెగా ఫ్యామిలీలు వెళ్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు వచ్చి పరామర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగా హీరోలు కూడా రేపు రానున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద వందలాది మంది అభిమానులు కనిపిస్తున్నారు. కోకాపేట వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. చిరంజీవి ఉదయమే ఎమోషనల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Read Also : Poorna : గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ.. రెండోసారి..!