Poorna : హీరోయిన్ పూర్ణ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లిగా ఉన్న ఈమె.. ఇప్పుడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోలకు జడ్జిగా కూడా చేసింది. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పూర్ణ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రెండో ఏడాదే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ గుడ్ న్యూస్ తెలిపింది పూర్ణ.
Read Also : Jagapathibabu : జగపతి బాబు టాక్ షోకు సంచలన దర్శకులు..
తాను రెండోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. ఈ విషయం చెప్పడానికి మా హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. పేరెంట్స్ అవడం జీవితంలో గొప్ప అదృష్టం. ఇప్పటికే దాన్ని పొందిన మేము.. రెండోసారి ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం. మా సెకండ్ బేబీకి వెల్ కమ్ చెబుతున్నాం అంటూ రాసుకొచ్చింది పూర్ణ. ఈ పోస్టు కాస్త క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఫ్యాన్స్ అందరూ ఆమెకు విషెస్ చెబుతున్నారు.
Read Also : Faria Abdullah : వామ్మో.. చిట్టి ఇలా చూపిస్తే కుర్రాళ్లకు నిద్ర కష్టమే..