Chinmayi: కమల్ హాసన్’పై చిన్మయి సంచలన కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జ్ఞానపీఠ్ పురస్కారం భారతీయ సాహిత్యంలోనే అత్యున్నతమైనది, దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఒక తమిళ సాహితీవేత్తకు ఈ గౌరవం దక్కడం ఆ రాష్ట్రానికి గర్వకారణమే అయినా, ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రముఖ కవి, రచయిత వైరముత్తుకు ఈ ఏడాది జ్ఞానపీఠ్ ప్రకటించగానే, అభినందనల కంటే వివాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2018లో వచ్చిన #MeToo ఉద్యమం మళ్లీ తెరపైకి వచ్చింది. వైరముత్తుకు అవార్డు దక్కిన వార్త బయటకు రాగానే, గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన చిన్మయి, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం వైరముత్తునే కాకుండా, ఆయనను సమర్థిస్తున్న సినీ, రాజకీయ దిగ్గజాలను కూడా ఆమె తన విమర్శలతో కడిగిపారేశారు.
Also Read:Movie Shootings: సినిమా షూటింగ్’లపై గ్యాస్ గుది బండ
Also Read
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
ముఖ్యంగా, వైరముత్తును అభినందిస్తూ లోకనాయకుడు కమల్ హాసన్ పెట్టిన పోస్ట్‌ను చిన్మయి టార్గెట్ చేశారు. జయకాంతన్ తర్వాత 20 ఏళ్లకు ఒక తమిళుడికి ఈ గౌరవం దక్కడం తమిళనాడుకు గర్వకారణమని, వైరముత్తు తన ఆప్తమిత్రుడని కమల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన చిన్మయి, కమల్ హాసన్ వంటి వ్యక్తుల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. “సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శక్తివంతులైన వ్యక్తులు, బాధితుల గోడును వినడానికి నిరాకరిస్తున్నారు. పురుషులు ఎప్పుడూ తమ ‘బ్రదర్స్, అంకుల్స్, ఫ్రెండ్స్’ వైపే నిలబడతారని మహిళలు గుర్తించాలి” అని ఆమె ఘాటుగా విమర్శించారు. నిజం మాట్లాడినందుకు తాను తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్, సింగింగ్ పరంగా నిషేధాన్ని ఎదుర్కొన్నానని, ఎంతోమంది మహిళల గొంతును తొక్కేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఎందరో మహిళలు తమ కలలను వదులుకున్నారు. వారి ఆవేదన ఎవరికీ పట్టదా? పురుషులు తమ స్నేహితుల కోసమే నిలబడతారని చెప్పడానికి ఇదే నిదర్శనం.” అని చిన్మయి శ్రీపాద అన్నారు.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?