Chaitra Vasudevan: విడాకుల స్టేట్మెంట్తో షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chaitra Vasudevan Announced Her Divorce With Husband Satya: ఈమధ్య సినీ పరిశ్రమలో విడాకుల పర్వం కొనసాగుతోంది. అన్యోన్యంగా కలిసి ఉండే జంటలు కూడా.. విడాకుల ప్రకటనతో సడెన్ షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో ఇన్నాళ్లూ ఆదర్శ దంపతులుగా పేరుగాంచిన ఓ జంట విడిపోయింది. తమ ఐదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నామని.. కన్నడ నటి, యాంకర్ చైత్ర వాసుదేవన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. దీంతో.. ఆమె అభిమానులతో పాటు సినీ వర్గాలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
Viral Video: వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేస్తున్న లవర్స్.. ఇదేం పిచ్చి..
Also Read
చైత్ర వాసుదేవన్ కన్నడ బిగ్‌బాస్ సీజన్ 7తో మంచి పాపులారిటీ సంపాదించాంది. యాంకర్‌గా, నటిగా తనదైన ముద్ర వేసిన ఈ నటి.. 2017లో ప్రముఖ వ్యాపారవేత్త సత్య నాయుడుని పెళ్లి చేసుకుంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లైన నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. ఆదర్శ దంపతులకు ఉదాహరణగా నిలిచారు. అలాంటి ఈ జంట ఇప్పుడు విడిపోయింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుంది. తన విడాకులపై చైత్ర ఇన్‌స్టాలో పోస్ట్ పెడుతూ.. ‘‘డియర్ ఆల్, ఎన్నో నెలలు బాగా ఆలోచించాక ఈ విషయం మీకు చెప్పాలని నిర్ణయించుకున్నా. సత్య, నేను విడిపోయాం. దయచేసి మా విడాకులపై ఎవరూ అసభ్యంగా మాట్లాడొద్దు. మాలో ఎవరిపైనా ద్వేషం చూపించొద్దు. మమ్మల్ని జడ్జ్ చేయొద్దు’’ అంటూ పోస్ట్ పెట్టింది.
Kangana Ranaut: ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు సిగ్గుపడాలి.. కరణ్ జోహర్‌పై కంగనా ఎటాక్
అంతేకాదు.. ఈ విడాకుల బాధ నుంచి బయటపడేందుకు తాను చాలా కష్టపడుతున్నానని, ఇలాంటి సమయంలో తమ విడాకులపై ఎవరైనా బ్యాడ్‌గా మాట్లాడితే అది తనను ఇంకా బాధిస్తుందని చైత్ర పేర్కొంది. జీవితంలో అన్నీ మర్చిపోయి ముందుకు సాగడానికి.. మనం చేసే పనే మనకు సహాయపడుతుందని తెలిపింది. తాను ఇండస్ట్రీలో పదేళ్లకుపైగా పనిచేశానని, విడాకుల అనంతరం నటిగా తన ప్రయాణం కొనసాగించాలని అనుకుంటున్నానని వెల్లడించింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!