Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితిన్ తదుపరి చిత్రం ఎట్టకేలకు లాంఛనంగా ప్రారంభమైంది. ‘తమ్ముడు’ సినిమా ఫలితం తర్వాత కాస్త సుదీర్ఘ విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాతో నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. బుధవారం జరిగిన పూజా కార్యక్రమంతో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. నితిన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, అనిత్ మదాడి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఒక పర్ఫెక్ట్ టెక్నికల్ టీమ్‌తో దృశ్యపరంగా ఈ సినిమాను అద్భుతంగా మలిచేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ నెల (మే) రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని సర్ప్రైజింగ్ వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
Also Read
- OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
- Box Office Records: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..
- NTRxTrivikram: 'గాడ్ ఆఫ్ వార్' రూమర్లకు నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్.. ఒక్క ఫ్రేమ్‌తో ఫ్యాన్స్ ఖుష్!
- Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. 'స్వాభిమానం' మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
తాజావార్తలు
-
Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
-
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
-
Box Office Records: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..
-
Team India Record: టీమిండియా చరిత్రలోనే ఘోర ఓటమి.. దెబ్బకు రికార్డులు తారుమారు..
-
Jammu Kashmir: ఇద్దరు పోలీసుల దారుణహత్య.. హిజ్బుల్ టెర్రరిస్ట్ సహా ముగ్గురిపై రూ. 30 లక్షల రివార్డ్!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?