Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ నడుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా హార్దిక్ ఆడలేదు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్‌పూర్‌లో జరగబోయే తదుపరి మ్యాచ్‌కైనా అతను అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. కానీ, బుధవారం ముంబై టీమ్ విమానాశ్రయం నుంచి బయలుదేరినప్పుడు హార్దిక్ అక్కడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అతను తర్వాత టీమ్‌తో కలుస్తాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఫామ్‌లో లేని హార్దిక్..
ఈ సీజన్లో హార్దిక్ ఆటతీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 146 పరుగులు మాత్రమే చేశాడు. అటు బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో అతని గైర్హాజరీకి కేవలం గాయమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. గత మ్యాచ్‌లో హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన మ్యాచ్ లకు కూడా హార్దిక్ దూరంగా ఉంటే.. . తదుపరి మ్యాచ్ లకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ముంబై టీం ముందుకు సాగనుంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ముంబై ఇండియన్స్ కష్టాలు..
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణంగా విఫలమైంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అసలు ముంబైకి ఏమైంది? అనేది ఇప్పుడు అభిమానుల ప్రశ్న.
వైఫల్యానికి కారణాలు ఏంటి?
ముంబై జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం నాయకత్వ మార్పు అని విశ్లేషకులు భావిస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి, హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించడం జట్టులోని ఐక్యతను దెబ్బతీసినట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ నాయకత్వంలో జట్టు ఎంతో నిలకడగా ఉండేది. కానీ హార్దిక్ కెప్టెన్ అయ్యాక, అటు ఆటగాడిగా ఇటు కెప్టెన్‌గా అతను ప్రభావం చూపలేకపోయాడు. క్లిష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలోనూ, బ్యాటింగ్ లేదా బౌలింగ్‌తో జట్టును గెలిపించడంలోనూ హార్దిక్ విఫలం కావడం ముంబైని కోలుకోలేని దెబ్బ తీసింది. మొత్తానికి ఈ సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయేలా ఉంది.
తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?