Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 ఏళ్ల క్రితం మలయాళ దృశ్యం రీమేక్‌గా వచ్చిన హీరో ‘వెంకటేష్’ ‘దృశ్యం’ మూవీ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హత్యానేరం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు చేసిన పెర్ఫార్మెన్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ దెబ్బతో ఆ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తమిళ్, హిందీ, ఆఖరికి చైనీస్, శ్రీలంక భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఆ తరువాత ‘దృశ్యం 2’ రీమేక్ కూడా ఓటీటీలో రిలీజైతే, తెలుగు ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరించారు. ఇదిలా ఉంటే, ఇక ఇప్పుడు తాజాగా ‘దృశ్యం 3’ అంటూ మలయాళ మేకర్స్ ఏకంగా డైరెక్ట్ ఒరిజినల్ ఫిల్మ్‌ను అన్ని భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో మే 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే, తాజాగా టీజర్ రిలీజ్ చేసి కేరళ నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే అక్కడ మోహన్ లాల్, ఇక్కడ వెంకటేష్ కూతురిగా రెండు పార్ట్స్‌లోనూ నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ‘ఎస్తర్ అనిల్’ చేసిన కామెంట్స్ ఇప్పుడు సౌత్ వైడ్‌గా సెన్సేషనల్‌గా మారాయి.
ఆమె ‘దృశ్యం’ పార్ట్ 1 షూటింగ్ నాటి సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ… “పోలీస్ ఇంటరాగేషన్ సీన్‌లో కానిస్టేబుల్ మోహన్ లాల్ సార్‌ను కింద పడేసి తన్నుతూ ఉంటాడు… ఆ టైంలో మోహన్ లాల్ సార్ తన ఫ్యామిలీ వైపు చూస్తూ ఓ చిన్న స్మైల్ ఇస్తారు. సరిగ్గా ఇదే సీన్‌ను తెలుగులో వెంకీ అంకుల్‌ని పెట్టి తీస్తున్నప్పుడు, ‘ఆయనలా నేను పెర్ఫార్మ్ చేయలేను, నీకో దణ్ణం’ అని డైరెక్టర్‌తో అన్నారు” అని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు, నిజంగా మోహన్ లాల్ సార్ యాక్ట్ చేసినట్లు ఏ హీరో కూడా నటించలేకపోయారు అంటూ ఆమె మోహన్ లాల్‌ను ఆకాశానికి ఎత్తేశారు. దీంతో ఈ కామెంట్స్‌కు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇలా ‘ఎస్తర్’, ‘మోహన్ లాల్’ పెర్ఫార్మెన్స్‌ను అభినందించే క్రమంలో, వెంకటేష్ పెర్ఫార్మెన్స్‌ను తక్కువ చేసినట్లుగా కనిపిస్తున్న ఈ కామెంట్స్‌ను వెంకీ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో వేచి చూడాలి.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!