Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, గత మ్యాచ్‌ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిపారు. పంజాబ్ జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి రాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మళ్లీ చేరారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పరుగుల సునామీ సృష్టించారు. కేవలం 3.2 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 మార్కు దాటించి హైదరాబాద్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ జట్టు ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. ఇందులో అభిషేక్ శర్మ 13 బంతుల్లో 35 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 35 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. మొత్తానికి 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
అయితే ఈ పరుగుల వరదలో పంజాబ్ ఫీల్డర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. పంజాబ్ ఆటగాళ్లు ఏకంగా మూడు క్యాచ్‌లను జారవిడవడంతో పాటు ఒక సులభమైన స్టంపింగ్ అవకాశాన్ని కూడా వృథా చేశారు. కూపర్ కానోలీ, శశాంక్ సింగ్ మరియు ఫెర్గూసన్ తలో క్యాచ్ వదిలేయగా, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌ను స్టంపింగ్ చేసే అవకాశాన్ని ప్రభ్సిమ్రాన్ సింగ్ మిస్ చేశారు. ఈ సీజన్లో శశాంక్ సింగ్ ఇప్పటివరకు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం గమనార్హం. దీనిపై పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందిస్తూ, బంతి శశాంక్‌ను వెంటాడుతున్నట్లు ఉందని సానుభూతి వ్యక్తం చేశారు. పవర్ ప్లేలో హైదరాబాద్ బ్యాటర్లు సృష్టించిన విధ్వంసానికి పంజాబ్ ఫీల్డర్ల తప్పిదాలు కూడా తోడయ్యాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!