Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా?
- అంతర్జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు
- 24 గంటల్లో ఉండొచ్చని ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయా? మళ్లీ రెండు దేశాలు చర్చలు జరపనున్నారా? మరోసారి ఇస్లామాబాద్ వేదిక కాబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇప్పటి వరకు ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇస్లామాబాద్ వేదికగా ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగాయి. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా ఇరాన్ ముందు అమెరికా 14 సూత్రాల శాంతి ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనలను ఇరాన్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో రాబోయే 24-72 గంటల్లో పురోగతి సాధిస్తామని పాకిస్థాన్ అంటోంది. ఇస్లామాబాద్ వేదికగా మరోసారి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఆంక్షల సడలింపు, అణ్వాయుధాల నియంత్రణ, కాల్పుల విరమణ పొడిగింపు వంటి అంశాలతో అమెరికా-ఇరాన్ చర్చలు ఒక ఒప్పందానికి చేరువవుతున్నాయని ఇస్లామాబాద్ చెబుతోంది.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
అమెరికా-ఇరాన్ ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు దగ్గరగా ఉన్నాయని.. త్వరలో ఇస్లామాబాద్‌లో మరో విడత చర్చలు జరగనున్నాయని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలోని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రతిపాదనలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించడం, ఘర్షణలకు విరామం ఇవ్వడం, అణు, ప్రాంతీయ భద్రతా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపడం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధానాంశం ఏమిటంటే.. యురేనియం శుద్ధిని నిలిపివేయడం, బాలిస్టిక్ క్షిపణి విస్తరణను ఆపడం, ఐక్యరాజ్యసమితి తనిఖీలను అంగీకరించడం, భూగర్భ అణు కేంద్రాల వద్ద కార్యకలాపాలను పరిమితం చేయడం వంటి వాటికి ఇరాన్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా అమెరికా ఆంక్షలను సడలించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ చమురు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతించడం వంటివి టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.
పాకిస్థాన్, టర్కీ, రష్యా, చైనా, గల్ఫ్ దేశాలతో సహా పలు దేశాల నుంచి అభిప్రాయాలను స్వీకరించి.. ఐదు నుంచి 14 సూత్రాల వరకు ఉన్న పలు ముసాయిదాలపై చర్చలు జరిపినట్లు పాకిస్తానీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలుకు హామీలు ఇవ్వడంలో చైనా, రష్యా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కూడా పాలుపంచుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఈ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..