Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Nayagan: తమిళనాడు రాజకీయ చరిత్రలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, తన రాజకీయ అరంగేట్రంతోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా థియేటర్లలో ప్రత్యక్షమైన ‘జననాయగన్’ చిత్రానికి సంబంధించిన కొత్త టైటిల్ కార్డ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఆ టైటిల్ కార్డ్‌లో ఏముందంటే..
సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. జననాయగన్ సినిమాలో విజయ్ పేరుకు ముందు “తమిళనాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్” (Honourable Chief Minister of Tamil Nadu C. Joseph Vijay) అని ప్రదర్శించారు. భారతదేశ సినీ చరిత్రలో ఒక నటుడికి ‘ముఖ్యమంత్రి’ అనే ట్యాగ్‌తో టైటిల్ కార్డ్ పడటం ఇదే తొలిసారి అని విజయ్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ఫ్యాన్స్ థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు. డ్యాన్సులతో, కేకలతో సినిమా హాళ్లు హోరెత్తిపోతున్నాయి.
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
First ever CM title card for an ACTOR in India. 🔥💥🧨
C. Joseph Vijay pic.twitter.com/FTATW5InOU
— KARTHIK DP (@dp_karthik) May 6, 2026
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, విజయ్ రాజకీయ హోదాను సినిమాలో కూడా ప్రతిబింబించాలని అభిమానులు కోరారు. వారి కోరిక మేరకే మేకర్స్ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వాస్తవానికి జనవరి 9న విడుదల కావాల్సింది. అయితే చిత్రంలో రాజకీయ పరమైన అంశాలు ఎక్కువగా ఉండటం, మార్చి 15 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలనకు పంపింది. దీనివల్ల సినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజూ ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ కెరీర్లో ఇదే ఆఖరి సినిమా అని ప్రచారం జరుగుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదే సమయంలో తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ ఘనవిజయంపై కేవీఎన్ నిర్మాణ సంస్థ అధినేత వెంకట్ స్పందిస్తూ.. “ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చరిత్ర సృష్టించిన మా ‘జననాయగన్’ విజయ్ సర్‌కు అభినందనలు. ఇది ఒక విప్లవం, తరతరాల పాటు ఈ విజయం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది” అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ‘సీఎం’ టైటిల్ కార్డ్ వీడియో తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతోంది.
Heartiest congratulations to our ‘Jana Nayagan’, Thalapathy Vijay sir, on scripting history today against all odds. It is indeed a revolution and one that will echo for generations to come.
– Venkat K Narayana (KVN) pic.twitter.com/cvAQ6yGU08— KVN Productions (@KvnProductions) May 4, 2026
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!