దిల్ రాజు తమ్ముడు శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారింది. ఎప్పుడు మీడియాతో మాట్లాడని శిరీష్ తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూ పలు వివాదాలకు దారి తీసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజు ఆయన తమ్ముడు శిరీష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై నిర్మాత దిల్ రాజు తమ్మడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసారు.
Also Read : Naga Vamsi : వార్2 తెలుగు స్టేట్స్ రిలీజ్.. నాగవంశీ విధ్వంసం
దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ’ శిరీష్ ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు నాకు తెలియదు. ఆయన్ని 30 ఏళ్ల నుంచి చూస్తున్నారు కదా మీడియా ముందుకి రాడు. అసలు ఎప్పుడు మాట్లాడడమే చేయడు, నేనే మీడియాతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. సదరు జర్నలిస్ట్ వెంటపడి వెంటపడి ఇంటర్వ్యూకి ఒప్పించారు. ఇంటర్వ్యూ జరుగుతున్న విషయం జరిగిన విషయం కూడా నాకు తెలియదు. తెలిసి ఉంటే ఆపేవాడిని.. నువ్వేం మాట్లాడుతున్నావో ముందే చెప్పమని అడిగేవాడిని. దయచేసి హెల్ప్ చేయకపోయినా పర్లేదు. డ్యామేజ్ చేయద్దు. కొత్తగా చెబుతున్నప్పుడు ఎవరైనా అడుగుతున్నప్పుడు ఒక స్టోరీ మొదలయితే ఆ ఫ్లో ఆగదు. నన్ను అదే ప్రశ్న అడిగితే నేను స్మార్ట్ గా దాటవేస్తా ఎందుకంటే తర్వాత జరగబోయే పరిణామాలను నేను బేరీజు వేసుకుంటాను. ఇంటర్వ్యూలో చిన్న చిన్న బిట్లు కట్ చేసి పెట్టడం వల్ల విషయాలే మారిపోతున్నాయి..
సోషల్ మీడియా వచ్చాక చిన్న చిన్న బిట్లు తీసుకుని ఏదైతే హైలైట్ ఉందో దాన్ని థంబ్నెయిల్ గా పెడుతున్నారు. వాటి వల్లే ఇంకా రచ్చ జరుగుతుంది. ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయండి’ అని అన్నారు.