Brahmanandam Cameo in Ram Charan Game Changer: ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఓల్డ్ లుక్‌లో పొలిటిషియన్‌గా, యంగ్ లుక్‌లో కలెక్టర్‌గా కనిపించనున్నాడని టాక్ అయితే ఉంది. ఇప్పటికే లీక్ అయిన చరణ్ లుక్స్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉందని చెప్పక తప్పదు. అయితే ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్మిస్తున్న దిల్ రాజు వెల్లడించారు.
Bandla Ganesh: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..
ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అంతకుముందు శంకర్ సినిమాలో ఒకసారి బ్రహ్మానందం నటించారు. ఇది శంకర్ డైరెక్షన్లో బ్రహ్మానందం కనిపించడం రెండో సారి. వయసు పైబడిన నేపద్యంలో బ్రహ్మానందం ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. చాలా సెలెక్టివ్ గా ఒకటి అరా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఆయన పూర్తిస్థాయిలో కనిపించిన కీడా కోలా ఈ మధ్యనే విడుదలైంది. ఇటీవల విడుదలైన సుమ కొడుకు రోషన్ బబుల్ గం సినిమాలో కేవలం ఒక సీన్ కి మాత్రమే ఆయన పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఈ రోజు షూటింగ్లో కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. రేపు కూడా ఆయన షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా చెబుతున్నారు.