Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నేత అయిన బండ్ల గణేష్ కారు డ్రైవర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్ల గణేష్ కారు డ్రైవర్ రమణ భార్య చందన ఆత్మహత్య చేసుకుంది. బండ్లన్న దగ్గర రమణ ఎంతో కాలంగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం.. రమణ, చందనవివాహం జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో ఈ జంట కాపురం పెట్టారు.
ఇక కొన్నిరోజులు బాగానే ఉన్న ఈ జంట మధ్య కలహాలు మొదలయ్యాయి. నిత్యం రమణ, చందన మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవని సమాచారం. అయితే చందన కుటుంబ కలహాలను తట్టుకోలేక తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చందన మృతికి గల కారణాలు ఏంటి అనేవి తెలియాల్సి ఉంది. భర్త రమణపై బంధువులు అనుమాం వ్యక్తం చేస్తున్నారు.