Brahmaji: టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి అందరికి తెల్సిన విషయమే. ట్వీట్ అయినా, పోస్ట్ అయినా, పంచ్ అయినా అందులో కచ్చితంగా వినోదం ఉండాల్సిందే. మొన్నటికి మొన్న ఆంటీ గొడవకు ఆజ్యం పోస్టు అంకుల్ అంటే కేసు పెడతా అని హిల్లేరియస్ గా కౌంటర్ ఇచ్చిన బ్రహ్మాజీ తాజాగా గాడ్ ఫాథర్ ప్రెస్ మీట్ స్టేజిపై జబర్దస్త్ నటుడు బ్రహ్మజీని ఆడేసుకున్నాడు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో గెటప్ శ్రీను ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
ఇక ప్రమోషన్లో భాగంగా చిరు తో పాటు గెటప్ శ్రీను కూడా అన్ని చోట్లా ట్రావెల్ చేస్తున్నాడు. మొన్నటికీ మొన్న చిరుతో పాటు ఫ్లైట్ లో వెళ్లిన ఫొటోస్ ను షేర్ చేస్తూ తన డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. ఇక ఆ విషయాన్నీ బ్రహ్మాజీ గుర్తుచేస్తూ శ్రీనును ఆడుకున్నాడు. “ఈయన కొంచెం మాట్లాడడం మానేశాడు.. అన్నయ్యతో ఫ్లైట్ లో వచ్చాడు .. అందుకే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అన్నయ్య పవర్ ఏంటో రేపు అందరితో పాటు మనం చూస్తాం.. ఇప్పుడు సెలబ్రిటీ మాట్లాడతారు. ఫ్లైట్ లో అన్నయ్య కన్నా ఈయనే ఎక్కువ చేశాడు. ఈయన ఫ్లైట్ ఓనర్ లా, ఈయనతో అన్నయ్య ట్రావెల్ చేస్తున్నట్లు ఫీల్ అయ్యాడు.. యాటిట్యూడ్ వాలా” చెప్పుకొచ్చాడు. అయితే ఇది సరదాకు అన్నా ప్రస్తుతం బ్రహ్మాజీ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం గెటప్ శ్రీను మంచి ఫార్మ్ లో ఉన్నాడు. స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ ఛాన్స్ పట్టేస్తున్నాడు. ముందు ముందు రోజులో స్టార్ కమెడియన్ గా గెటప్ శ్రీను మారతాడేమో చూడాలి.