బోయపాటి శ్రీనుకు మళ్లీ మంచిరోజులొచ్చాయి అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలవారు. వినయ విధేయ రామ చిత్రంతో డిజాస్టర్ ని అందుకున్న బోయపాటి ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని తనకు విజయాలను తెచ్చిపెట్టిన బాలయ్యతో మూడో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కసిని అంతా మాస్ యాక్షన్ గా మలిచి అఖండ లో చూపించాడు. అఖండ విడుదలై అఖండమైన విజయాన్ని అందుకుంది.. దీంతో బోయపాటి కల ఫలించి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. దీంతో స్టార్ హీరోలందరూ మళ్లీ బోయపాటి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు.
ఇప్పటికే పలు హీరోలు బోయపాటి నెక్స్ట్ లిస్ట్ లో ఉండగా ఆ లిస్ట్ లో జాయిన్ అయిపోయారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ స్క్రిప్ట్ చదివినప్పుడే ఆయనలోని మాస్ నాకు నచ్చింది అని చెప్పిన చిరు ఆయనతో సినిమా తీయడానికి నేనెప్పుడూ రెడీ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అఖండ మాస్ జాతర చూశాకా చిరు కూడా బోయపాటితో మూవీ చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఊర మాస్ కాంబోకి రంగం సిద్దమైనట్లే.. మెగాస్టార్ చిరు మాస్ అవతారం.. బోయపాటి మాస్ యాక్షన్స్ వెరసి మెగా ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.