బాలీవుడ్ గత కొంతకాలంగా సౌత్ హిట్ సినిమాలని రీమేక్ చేస్తూ హిట్స్ కొడుతోంది. ఈ కోవలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటిస్తున్న ‘సెల్ఫీ’ అనే సినిమా ఫిబ్రవరి 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అక్షయ్ కుమార్ “Fans make a star. Fans can also break a star! Find out what happens when a fan turns against his Idol. Watch #Selfiee in cinemas on Feb 24th” అని ట్వీట్ చేశాడు. ఈ లైన్ వింటే ఈ కథ ఎక్కడో చూసినట్లు ఉందే అనే ఫీలింగ్ సినీ అభిమానులకి కలగడం సహజం ఎందుకు అంటే అదో సూపర్ హిట్ మలయాళ సినిమా కాబట్టి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకి రీమేక్ గానే ‘సెల్ఫీ’ సినిమా తెరకెక్కుతుంది.
ఒరిజినల్ వర్షన్ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్లే చేసిన రోల్ ని రీమేక్ లో అక్షయ్ కుమార్ ప్లే చేస్తున్నాడు. యాక్టర్ సూరజ్ వెండ్రమూడు నటించిన పోలిస్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, స్టార్ హీరోకి మధ్య జరిగిన ఇగో ఇష్యూ ఎంత దూరం వెళ్లింది అనేది ఈ కథలో సూపర్బ్ గా ప్రెజెంట్ చేశారు. మలయాళంలో లాల్ డైరెక్ట్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని హిందీలో రాజ్ మెహతా డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్ వర్షన్ మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది కాబట్టి హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒరిజినల్ వర్షన్ ని ప్రొడ్యూస్ చేసిన సుప్రియ మీనన్, బాలీవుడ్ లో కూడా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. జనవరి 19న ‘సెల్ఫీ’ ట్రైలర్ ని లాంచ్ చెయ్యనున్నారు. ఇదిలా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ రైట్స్ ని రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. మరి ఈ మూవీ ఎవరితో చేస్తాడు? ఎవరు హీరోగా నటిస్తారు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.
Fans make a star. Fans can also break a star!
Find out what happens when a fan turns against his Idol. Watch #Selfiee in cinemas on Feb 24th. pic.twitter.com/gJTEa2ownD— Akshay Kumar (@akshaykumar) January 15, 2023