బాలీవుడ్ గత కొంతకాలంగా సౌత్ హిట్ సినిమాలని రీమేక్ చేస్తూ హిట్స్ కొడుతోంది. ఈ కోవలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటిస్తున్న ‘సెల్ఫీ’ అనే సినిమా ఫిబ్రవరి 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అక్షయ్ కుమార్ “Fans make a star. Fans can also break a star! Find…
2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైనెస్స్’ చక్కని విజయాన్ని సాధించింది. ఓ సూపర్ స్టార్, అతని అభిమాని అయిన ఆర్టీఓ అధికారి మధ్య ఊహించని విధంగా ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఈ సెన్సిబుల్ పాయింట్ ను నట దర్శకుడు లాల్ తనయుడు జీన్ పాల్ లాల్ (జూనియర్ లాల్) హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ చిత్రంలో…