NTR 30: సముద్ర వీరుడి విలన్ వచ్చేసాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ‘ఎన్టీఆర్ 30’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. హ్యూజ్ యాక్షన్ బ్లాక్ ని ఫస్ట్ షెడ్యూల్ లో స్టార్ట్ చేసిన కొరటాల శివ, సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేశాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో నైట్ ఎఫెక్ట్ లో ‘ఎన్టీఆర్ 30’ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు నుంచే స్టార్ట్ అవ్వనున్న సెకండ్ షెడ్యూల్ లో బాలీవుడ్ యాక్టర్ ‘సైఫ్ అలీ ఖాన్’ జాయిన్ అయ్యాడు. ఎన్టీఆర్ కి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ వార్తని నిజం చేస్తూ మేకర్స్… సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“Team #NTR30 welcomes #SaifAliKhan on board , The National Award winning actor joined the shoot of the high voltage action drama” అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్ టు బాలీవుడ్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా మారింది. పాన్ ఇండియా రీచ్ కోసం ఇప్పటికే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకున్న కొరటాల శివ, సైఫ్ ని కూడా కాస్ట్-ఇన్ చెయ్యడం ‘ఎన్టీఆర్ 30’ మార్కెట్ ని పెంచే విషయమే. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో కూడా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ తో ఎన్టీఆర్ పోటీ పడితే ఆన్ స్క్రీన్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ లు కనిపించడం గ్యారెంటీ. మరి సముద్ర వీరుడిగా ఎన్టీఆర్ కనిపించనున్న ఎన్టీఆర్ కి అపోజిట్ లో సైఫ్ అలీ ఖాన్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాడో చూడాలి.
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023
తాజావార్తలు
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్‌లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!