Ranveer Singh: స్టార్లు అన్నాకా కొన్నిసార్లు అభిమానులతో ఇబ్బందులు పడక తప్పదు. తమ అభిమాన హీరో హీరోయిన్లు కనిపించినప్పుడు వారితో ఫోటో దిగడానికి ఫ్యాన్స్ కు ఎంతకైనా తెగిస్తారు. ఆ సమయంలో తారల బాడీగార్డ్స్ వారి చేతులకు పనిచెప్తూ ఉంటారు. అది అందరికి తెల్సిందే.. అయితే కొన్నిసార్లు బాడీగార్డ్స్ ఫ్యాన్స్ ను అదుపుచేసే క్రమంలో ఒకటి రెండు సార్లు వారి చేతులు సదురు సెలబ్రిటీస్ కే తగులుతుంటాయి. తాజాగా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్. శనివారం జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైమా 2022 అవార్డ్స్ ఫంక్షన్ కు రణ్వీర్ బెంగుళూరు లో దర్శనమిచ్చిన విషయం విదితమే.
ఇక ఈ నేపథ్యంలోనే రణ్వీర్ ను చూడడానికి అభిమానులు క్యూ కట్టారు. అతను బయటికి రాగానే ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. మా హీరో కూడా ఓపిగ్గా వారితో ముచ్చటిస్తూ అందినంత వరకు వారితో ఫోటోలు దిగడానికి ప్రయత్నించాడు. అయితే అభిమానులు మరింత ముందుకు వచ్చి రణ్వీర్ ను లాగే ప్రయత్నం చేస్తుండగా ఆయన బాడీగార్డ్స్ అడ్డుకోవడానికి ముందుకు వచ్చారు. వారిని చేతులో తోస్తూ, చేతికి దొరికినవారిని కొట్టేస్తూ అడ్డు తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక బాడీగార్డ్ చేయి రణ్వీర్ ను చెంపను గట్టిగా తాకుతూ వెళ్ళింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన రణ్వీర్ దెబ్బ గట్టిగా తగలడంతో చెంప మీద చేయి పెట్టుకొని బాధపడ్డాడు. వెంటనే చుట్టూ చూసి బాడీగార్డ్స్ ను ఆగమని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. రణ్వీర్ ఇచ్చిన రియాక్షన్ బట్టి దెబ్బ గట్టిగానే తగిలిందని అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.