Sonali Phogat: హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, కంటెంట్ క్రియేటర్ సోనాలి ఫోగట్ (42) గుండెపోటుతో సోమవారం రాత్రి గోవాలో మరణించారు. టిక్‌టాక్ వీడియోలతో సోనాలి ఫోగట్ పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. 2020లో బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. 2006లో పాపులర్ హిందీ టీవీ యాంకర్‌గానూ గుర్తింపు పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సోనాలీ ఫోగట్‌కు 8.8 లక్షల మంది ఫాలోవర్లున్నారు. అటు రాజకీయాల్లోనూ సోనాలి ఫోగట్ రాణిస్తున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయినా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.
Read Also: God Father Teaser: కాపీ చేసి మళ్లీ దొరికిపోయిన తమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్‌లు
కాగా సోనాలి ఫోగట్ మృతి పట్ల హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. సోనాలి ఫోగట్ మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడినట్లు సదరు పోస్టులో తెలిపారు. మరోవైపు ఆడంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి కుల్దీప్ బిష్ణోయ్ ఇటీవల రాజీనామా చేశారు. ఆమె బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో బీజేపీ తరఫున తాను పోటీ చేసేందుకు బిష్ణోయ్ ఇటీవల సోనాలి ఫోగట్‌ను కలిసి చర్చించారు. కానీ ఇంతలోనే సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించారు.