బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ లాంచ్‌తో ప్రారంభమైన ఈ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లగా, ఇప్పుడు నాలుగో వారం కూడా ఒకరు ఎలిమినేట్ కావడంతో హౌజ్‌లో కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గింది. మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద, మూడో వారం ప్రియా శెట్టి షో నుంచి బయలుదేరారు. ప్రియా ఎలిమినేషన్‌కు ముందు ‘రాయల్ కార్డ్’ ఎంట్రీగా దివ్య నిఖితా హౌజ్‌లోకి రావడంతో, ఇప్పటివరకు మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లో కొనసాగుతున్నారు.
Also Read : Vijay Devarakonda : ప్రేమ, పెళ్లి.. షాకింగ్ స్టెట్‌మెంట్ పాస్ చేసిన విజయ్ దేవరకొండ !
కాగా ఈ వారం నామినేషన్స్‌లో దివ్య నిఖితా, హరీష్ హరిత, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన గల్రాని – ఇలా ఆరుగురు నిలిచారు. ఓటింగ్ ప్రకారం సంజన గల్రాని టాప్‌లో నిలిచింది. తర్వాత వరుసగా దివ్య, శ్రీజ, రీతూ, ఫ్లోరా సురక్షితంగా ఉండగా, కనీస ఓట్లు సాధించిన హరీష్ హరిత ఎలిమినేట్ అయ్యాడు. మొదట డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని టాక్ వచ్చింది. అలా అయితే హరీష్‌తో పాటు శ్రీజ కూడా ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ చివరికి బిగ్ బాస్ సింగిల్ ఎలిమినేషన్‌కే ఫిక్స్ అయ్యి, హరీష్ మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు హరీష్‌కు వారానికి సుమారుగా రూ.60 వేల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే, నాలుగు వారాలు (28 రోజులు) హౌజ్‌లో ఉన్నందుకు హరీష్ మొత్తం రూ.2 లక్షల 40 వేల వరకు సంపాదించాడు.