Biggboss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 .. అన్ని సీజన్స్ కంటే కాస్తా డిఫరెంట్ గా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. నామినేషన్స్ లో సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్తూ రచ్చ చేస్తూ.. కంటెంట్ మాత్రం బాగా ఇస్తున్నారు. ఇక గేమ్స్ విషయంలో కూడా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా మొదటి నుంచి కూడా గేమ్ లో ప్రశాంత్ ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. ప్రశాంత్ ఉన్న గేమ్ లో ఒక్కసారిగా ఓడిపోలేదు అని శివాజీ చెప్పిన మాటను నిజం చేస్తున్నాడు. ఇక ప్రతి నామినేషన్ లో ప్రశాంత్ ను టార్గెట్ చేస్తున్న అమర్, గౌతమ్ .. ఈసారి గేమ్ నుంచి ప్రశాంత్ ను బయటికి పంపారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో బెలూన్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ ను రెండు గా విడగొట్టి.. ఎల్లో, రెడ్ టీమ్స్ గా మార్చాడు.
Mega 156: షాకింగ్.. మెగా 156 టైటిల్ లీక్..?
ఇక ఇందులో అడుగుతుండగా మధ్యలో గెలిచిన టీమ్.. అవతలి టీమ్‌లో నుంచి ఒక ఆటగాడిని గేమ్ నుంచి తప్పించాలని, వారి మెడలో డెడ్ బోర్డు వేయాలని చెప్పగా .. గౌతమ్ టీమ్ మొత్తం ప్రశాంత్ ను తీసివేయాలని తెలిపింది. దానికి ప్రశాంత్ ఏడ్చాడు. ఇది కేవలం టీమ్ నిర్ణయమని.. స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టే తీసేశామని చెప్పడంతో ప్రశాంత్ ఆగాడు. ఇక శివాజీ సైతం ప్రశాంత్ ను ఓదారుస్తూ.. తన చేతులతోనే డెడ్ బోర్డు ను ప్రశాంత్ మెడలో వేశాడు. ఈ ఒక్క గేమ్ పోతే ఏం కాదు అని చెప్పడంతో ప్రశాంత్ మళ్లీ పుష్ప రేంజ్ లో తొడగొట్టి బయటికి వచ్చాడు. మరి ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.