Bigg Boss Telugu 7 Amardeep vs gautham krishna fight: బిగ్ బాస్ తెలుగు 7లో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ – అమర్‌దీప్ మధ్య జరిగిన గొడవ పెద్ద వివాదంగా మారింది. బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్కు శుక్రవారం ఎపిసోడ్‌లో జరగ్గా ఈ టాస్కులో అమర్‌దీప్, అంబటి అర్జున్, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్‌లు చివరి రౌండ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో చివరిగా ప్రశాంత్, అర్జున్ ఔట్ కాగా బిగ్ బాస్ కొత్త కెప్టెన్‌ను నిర్ణయించే టాస్కులో అమర్‌దీప్, ప్రియాంక జైన్‌లు పోటీ పడ్డారు. ఇక ఈ టాస్క్ లో అమర్‌దీప్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. పోరాటం చేసి గెలవాల్సిన చోట బ్రతిమాలుతూ, ఏడుస్తూ కనిపించడం హాట్ టాపిక్ అయింది. కెప్టెన్సీ టాస్కు జరుగుతున్న సమయంలో గౌతమ్ కృష్ణ ప్రియాంకకు సపోర్టు చేస్తానని చెప్పి అమర్ బ్రిక్స్‌ను పడేసేందుకు ప్రయత్నించగా అప్పుడు వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
Karthik Subbaraj: హీరోయిన్ బాలేదన్న రిపోర్టర్… దిమ్మతిరిగే షాకిచ్చిన కార్తీక్ సుబ్బరాజ్
ఈ క్రమంలో గౌతమ్‌ను అమర్ ‘మిత్ర ద్రోహి’ అని తిట్టి ఆ తర్వాత కూడా అలాగే పలుమార్లు నోరు జారాడు. ఇక ఇప్పుడు అదే పెద్ద వివాదంగా మారింది. అయితే ముందు నుంచి సోదరిగా భావిస్తూ వచ్చిన ప్రియాంకను కెప్టెన్‌గా చేసే వరకూ గౌతమ్ కృష్ణ పోరాటం చేయడంతో అమర్‌దీప్‌కు శత్రువులా మారిపోయాడు. ఇక ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. సోషల్ మీడియాలో చాలా మంది గౌతమ్‌కు మద్దతుగా కామెంట్లు పెడుతూ గతంలో జరిగిన ఎన్నో పాయింట్లను ఎత్తి చూపిస్తూ అమర్‌ను విమర్శిస్తున్నారు. నిజానికి గౌతమ్, అమర్ ఆరంభం నుంచీ స్నేహితుల్లా ఉంటున్నా, ఓ సందర్భంలో గౌతమ్ ఎలిమినేట్ అవ్వాలని అమర్ ఓట్ వేశాడు. అలాగే, ఓ కెప్టెన్సీ టాస్కులో శోభా శెట్టి కోసం ఆడి గౌతమ్‌ను ఔట్ చేశాడు. అయితే తనను ఓడించడానికి సిద్ధం అయితే తట్టుకోలేక గౌతమ్ మీద నిందలు వేసేశాడు.