అరేయ్ ఏంట్రా ఇది అన్న డైలాగ్ తో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బాగా ఫేమస్ అయ్యాడు.. ఇక ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ తో ఎంతోమంది అభిమానులను పోగుచేసుకున్న షన్ను.. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్లి తనదైన ఆటతో మెప్పించాడు. ఇక ఈ షో వలన తాను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు దీప్తి సునైనా ను పోగొట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో షన్ను, సిరి ల మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న దీప్తి,షన్నుకు బ్రేకప్ చెప్పిందని వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఇద్దరు విడిపోయి తమ కెరీర్ లను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా షన్ను ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. షన్ను బామ్మ మృతి చెందారు. ఈ విషయాన్ని షన్ను తన ససోషల్ మీడియా ద్వారా తెలిపారు.
బామ్మతో షన్ను మాట్లాడుతూ ఉన్న ఒక వీడియోను షేర్ చేసి కింద రిప్ అని పెట్టాడు. దీంతో షన్ను అభిమానులు షన్నును ఓదారుస్తూ బామ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ వీడియో చూసిన వారందరు బామ్మ చివరి కోరిక తీరకుండానే వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో బామ్మ షన్నును పక్కన కూర్చోపెట్టుకొని.. నా పెళ్లి చూస్తావా అని షణ్ను అడగ్గా ‘ఏమో చూస్తానో లేదో..’ అని బామ్మ అన్నట్లుగా ఉంది. ‘నువ్ ఉండాలి’ అని షన్ను అనగా.. పక్కన మరో ఇద్దరు ఖచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. దీంతో షన్ను పెళ్లి చూడకుండానే బామ్మ వెళ్లిపోయింది.. పాపం మనవాడి పెళ్లి చూసుంటే బావుండేది అని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం షన్ను ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు.