Bigg Boss : బిగ్ బాస్ సీజన్-9 రచ్చ రచ్చగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు సాగుతున్న షోలో.. మూడో వారం ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం ముందు నుంచే జరిగింది. ఈ రోజు ఉదయం బిగ్ బాస్ ప్రోమోలో సంజనా ఎలిమినేట్ అయినట్టు చూపించారు. అంతా అదే నిజం అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఎలిమినేట్ అయింది సంజనా కాదు. కేవలం ఆమెను ఎలిమినేట్ అయినట్టు డ్రామా ఆడించి స్టేజ్ పైకి తీసుకెళ్తారు.. ఆమెతో అందరి గురించి చెప్పమని నాగ్ అడగడంతో ఆమె రెచ్చిపోయి అందరి గురించి ఏవేవో చెప్పేసింది.
Read Also : Manchu Manoj : అర్జున్ రెడ్డి సినిమా మిస్ చేసుకున్న మంచు మనోజ్..
కానీ ఇక్కడే ట్విస్ట్ పేరుతో ఆమెను లోపలకు పంపించి ప్రియాశెట్టిని ఎలిమినేట్ చేస్తారు. అది రేపటి ఫుల్ ఎపిసోడ్ లో వస్తుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది ప్రోమోలో చూపించరు. మరి చూపించారు అంటే అది ఫేక్ అనే కదా. ప్రియాశెట్టి ఈ వారం టాస్కుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆమెకు ఓటింగ్ అందరికంటే తక్కువ వచ్చింది. అందుకే ఆమెను ఎలిమినేట్ చేసేశారు. ఈ వారం వైల్డ్ కార్డ్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. కానీ దానిపై రేపటి ఎపిసోడ్ లో క్లారిటీ రాబోతోంది.
Read Also : Manchu Manoj: తేజ సజ్జాతో గొడవలపై స్పందించిన మనోజ్