Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు మిరాయ్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. విలన్ గా మంచి పాత్ర పడింది. ఇప్పుడు వరుసగా అలాంటి పాత్రలే వస్తున్నాయంట. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తన వద్దకు వస్తే అనవసరంగా వదలుకున్నట్టు సీక్రెట్ రివీల్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. దాని గురించి మనోజ్ క్లారిటీ ఇచ్చుకున్నాడు. నేను పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో తప్పక నటించాల్సి వచ్చింది. అందులో లేడీ గెటప్ లో నటించాను. ఆ టైమ్ లోనే సందీప్ రెడ్డి వంగా నాకు అర్జున్ రెడ్డి ఆఫర్ చేశారు.
Read Also : Mirai : తగ్గిన మిరాయ్ టికెట్ ధరలు..!
కానీ పాండవులు పాండవులు తుమ్మెద సినిమా చాలా ఫాస్ట్ గా అయిపోతే అర్జున్ రెడ్డి చేద్దాం అనుకున్నా. కానీ ఆ మూవీ ఏడాదిన్నర పట్టింది. దాని వల్ల అర్జున్ రెడ్డి వదులుకోవాల్సి వచ్చింది. పాండవులు సినిమా తర్వాత వెంటనే కరెంట్ తీగ మూవీ చేశాను. అది ఏకంగా రెండేళ్లు పట్టింది. అలా నాలుగేళ్ల పాటు ఆ రెండు సినిమాలకే స్ట్రక్ అయిపోయాను. ఆ గ్యాప్ వల్లే మంచి సినిమాలు మిస్ చేసుకున్న. అది నా లైఫ్ లో జరగాల్సింది కాదు అనిపిస్తుంది. కానీ అలా జరగాలని రాసిపెట్టి ఉంది. కాబట్టి ఏం చేయలేం అంటూ తెలిపాడు మనోజ్. అతను చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : K-Ramp : కె-ర్యాంప్ అంటే బూతు కాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్