Bhoothaddam Bhaskar Narayana: ఇండస్ట్రీలో రోజుకో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు బయోపిక్స్ ట్రెండ్ నడిస్తే.. ఇంకొన్ని రోజులు బ్రేకప్ స్టోరీస్ నడుస్తాయి.. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో హర్రర్ స్టోరీస్ ట్రెండ్ నడుస్తుంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు, క్షుద్ర పూజలు.. ఇలాంటి కథలతో దర్శకులు.. ప్రేక్షకులను థియేటర్ లోనే భయపెడుతున్నారు. వీటినే ప్రేక్షకులు కూడా ఇష్టపడడం గమనార్హం. ఇక తాజాగా ఇలాంటి కథతోనే వస్తున్నాడు యంగ్ హీరో శివ కందుకూరి. ఆయన హీరోగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భూతద్ధం భాస్కర్ నారాయణ. రాశి సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత ఇతర కీలక పాత్రలు పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య రిలీజ్ అయినా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది.
ఇక తాజాగా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశారు. వరుసగా సైకో కిల్లర్ హత్యలను ఛేదించడానికి డిటెక్టివ్ అవతారం ఎత్తుతాడు భాస్కర్. అయితే పోలీసులు.. ఆ సైకో కిల్లర్.. భాస్కర్ అన్ననే అని ఆధారాలతో సహా పట్టుకొని అరెస్ట్ చేస్తారు. ఇక అన్నను కాపాడుకోవడానికి అసలైన సైకో కిల్లర్ ను పట్టుకోవడానికి భాస్కర్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అన్నది సినిమా కథ. ఇకఅసలు ఈ సీరియల్ కిల్లర్ ఎందుకు అమ్మాయిల మాత్రమే చంపుతున్నాడు. వారి తలలను నరికి క్షుద్రపూజలు చేయడం వెనుక మర్మం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్స్ ను బట్టి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక వీరి ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండడంతో మార్చి 1 న భూతద్ధం భాస్కర్ నారాయణ భయపెడతాడని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.