Bhoothaddam Bhaskar Narayana: ఇండస్ట్రీలో రోజుకో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు బయోపిక్స్ ట్రెండ్ నడిస్తే.. ఇంకొన్ని రోజులు బ్రేకప్ స్టోరీస్ నడుస్తాయి.. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో హర్రర్ స్టోరీస్ ట్రెండ్ నడుస్తుంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు, క్షుద్ర పూజలు.. ఇలాంటి కథలతో దర్శకులు.. ప్రేక్షకులను థియేటర్ లోనే భయపెడుతున్నారు.