బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇండియా వైడ్ సూపర్ క్రేజీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. కానీ, ఈ మధ్య ఆయన చేస్తున్న ఏ సినిమా కూడా వర్కౌట్ కావడం లేదు. నిజానికి, ఆయన గతంలో కూడా దర్శకులుగా కొందరి పేర్లు వేసి, ఆయన స్వయంగా డైరెక్ట్ చేశారనే పేరు ఉంది. కానీ, ఎప్పుడూ ఆయన దర్శకత్వం చేసినట్లు ఆ క్రెడిట్స్ తీసుకోలేదు. కానీ, ఆయన ఇప్పుడు ఒక సినిమాకి దర్శకుడిగా మారబోతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : Orry Drug Case: రూ.252 కోట్లు డ్రగ్స్ కేసులో ఓర్రీకి ముంబై పోలీసుల నోటీసులు
సల్మాన్ ఖాన్ కెరీర్‌లో దబాంగ్ సిరీస్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ సిరీస్‌లోనే దబాంగ్ 4 సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు కాబోతోంది. ఈ సినిమాలో ఆయన చుల్బుల్ పాండే పాత్రలో మళ్లీ కనిపించనుండగా, సోనాక్షి సిన్హా ఆయన సరసన భార్య పాత్రలో నటించబోతోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతానికి సల్మాన్ ఖాన్, బాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.