Bhagya Sri : భాగ్య శ్రీ బోర్సే.. నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్. టాలీవుడ్ లో మొదటి సినిమానే మాస్ మహారాజ రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. మిస్టర్ బచ్చన్ తో గ్లామర్ ను ఆరబోసింది. కానీ ఏం లాభం.. ఆరంభం ఆకట్టుకోలేదు. ఆ మూవీ దారుణంగా ప్లాప్ అయింది. అయినా సరే విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ తో వచ్చిన కింగ్ డమ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ కాబట్టి కచ్చితంగా హిట్ పడుతుందేమో అని ఆశ పడింది. ట్రైలర్ తో అంచనాలు భారీగా ఉండటం వల్ల హిట్ గ్యారెంటీ అనుకుంది. కానీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది మూవీ. ఈ రెండు సినిమాల్లో భాగ్య శ్రీ పాత్రకు పెద్దగా స్కోప్ ఏమీ లేదు. కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నట్టు కనిపిస్తుంది.
Read Also : Kingdom : కింగ్ డమ్ పార్ట్-2.. అవసరమా..?
వస్తూనే రెండు భారీ సినిమాల్లో ఛాన్స్ లు అందుకున్నా.. అదృష్టం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇక మూడో సినిమా రామ్ పోతినేని సరసన ఆంధ్రాకింగ్ తాలూకా మూవీలో చేస్తోంది. ఆ మూవీతో ఎలాగైనా హిట్ కొడితే మంచి బ్రేక్ వస్తుంది. లేదంటే మాత్రం టాలీవుడ్ నుంచి తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. అసలే సినిమాల్లో సెంటి మెంట్ ఎక్కువగా ఉంటుంది. హిట్ ఇచ్చిన హీరోయిన్ కే అవకాశాలు వస్తాయి. హిట్ లేకపోతే మాత్రం హీరోయిన్ ను ఎవరూ పట్టించుకోరు. ఎంత గ్లామర్ ఉన్నా వారిని పక్కన పెట్టేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది గ్లామర్ క్వీన్స్ అలా తప్పుకున్న వారే. మరి భాగ్య శ్రీని ఆంధ్రాకింగ్ ఒడ్డున పడేస్తాడా లేదా ముంచేస్తాడా అన్నది చూడాలి.
Read Also : Kingdom : శ్రీలీల టాలీవుడ్ గ్లామర్ గ్యాప్‌లోకి.. భాగ్యశ్రీ !